నీట మునిగిన కొచ్చి విమానాశ్రయం..అన్ని విమానాలు బంద్

Update: 2019-08-09 09:14 GMT

కేరళను మరోసారి వరదలు ముంచెత్తాయి. గత ఏడాది రోజుల తరబడి నీటిలో చిక్కుకున్న కేరళ మళ్లీ వరద ముంపునకు గురయింది. మళప్పురం, కొజికోడ్‌, వయనాడ్‌, ఇడుక్కి జిల్లాల్లో నదులు పొంగి ప్రవహిస్తుండడంతో ప్రభుత్వం రెడ్‌అలర్ట్‌ ప్రకటించింది. తాజాగా పెరియార్‌ నదిపై ఉన్న ఆనకట్టలో వరద ఉద్ధృతి పెరగడంతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా వరద ప్రవేశించింది. రన్‌వేపై నీరు ప్రవహిస్తుండంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు విమానాశ్రయంలో సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. 

Tags:    

Similar News