కాశ్మీర్ టెన్షన్: మోదీ నివాసానికి చేరిన అమిత్‌షా, దోవల్..

Update: 2019-08-05 04:24 GMT

జమ్మూకశ్మీర్‌లో తలెత్తిన అనిశ్చిత పరిస్థితిపై ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోనుందనే వార్తల నేపథ్యంలో కొద్దిసేపటిలో కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమవుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు ఇప్పటికే మోదీ నివాసానికి చేరుకున్నారు. తక్కిన కీలక మంత్రులు కూడా ఒక్కొక్కరే లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని మోదీ నివాసానికి చేరుతున్నారు.

విప్ జారీ చేసిన కాంగ్రెస్

కాగా, ఇవాల్టి పార్లమెంటు సమావేశంలో జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దు చేసే బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలందరికీ విప్ జారీ చేసింది. ఇవాల్టి పార్లమెంటు సమావేశాలకు ఎంపీలంతా హాజరుకావాలని ఆ విప్‌లో కోరింది. బీజేపీ సైతం ఇదే తరహా విప్ తమ ఎంపీలకు జారీ చేసింది.



Tags:    

Similar News