లాక్ డౌన్ ఈ ఎమ్మెల్యేకు వర్తించదా?

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Update: 2020-03-30 09:53 GMT

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 25 మంది మృతి చెందారు. అయితే దీనిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలో భాగంగా ఎవరు బయటికి రాకూడదని, సామాజిక దూరం పాటించాలని, దీనివలన కరోనా వైరస్ నీ అరికట్టవచ్చని చెప్పుకొచ్చింది. అయితే జనాలు ఇదేమీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రజలకి బుద్ధి చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు కూడా బయట తిరుగుతున్నారు. తాజాగా కర్ణాటక చెందిన ఓ ఎమ్మెల్యే తన మనవడితో కలిసి రోడ్లపైకి వచ్చి ఆటలు ఆడుతూ కనిపించారు. తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పే పదవిలో ఉండి ఇంత బాధ్యతారహితంగా ఆ ఎమ్మెల్యే ప్రవర్తించడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే.. తుమకూరు జిల్లా గుబ్బి నియోజకవర్గ జేడీఎస్‌ ఎమ్మెల్యే ఎస్‌.ఆర్‌.శ్రీనివాస్‌.. తన నివాస సమీపంలో హైవేపైకి మనవడితో కలిసి వచ్చి, ఆ పిల్లో డిని, ఛార్జింగ్ కారులో కూర్చొని డ్రైవింగ్ చేస్తుండగా ఆయన రిమోట్‌తో ఆపరేట్ చేశారు. మాస్కులు లేకుండానే సరదాగా ఆటలు ఆడుతూ చాలాసేపు గడిపారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నలుగురికి మంచి చెప్పాల్సిన ఆ ప్రజా ప్రతినిధి ఇప్పుడు ఇలా చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లాక్ డౌన్ అనేది ఇది కేవలం సామాన్య ప్రజలకు మాత్రమేనా? ప్రజా ప్రతినిధులకు వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు.. ఇక దీని పై కర్ణాటక ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఇక కరోనా వైరస్ రోజు రోజుకి చాప కింద నీరులా పరకుపోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షల కేసులు నమోదయ్యాయి. 30 వేలకు పైగా మరణించారు. కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులసంఖ్య 83 కి చేరింది.

Tags:    

Similar News