పిల్లల కోసం మాజీ భార్య ఇంటి ముందు మాజీ భర్త నిరసన

Update: 2020-02-11 07:55 GMT

తన పిల్లలను కలవడానికి తనను తన మాజీ భార్య అనుమతించడం లేదని ఆరోపిస్తూ ఓ ఐపిఎస్ అధికారి తన మాజీ భార్య ఇంటి ముందు నిరసన చేపట్టాడు . ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అరుణ్ రంగరాజన్ అనే అతను ప్రస్తుతం కలబుర్గి జిల్లాలో ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్‌లో ఎస్పీగా పని చేస్తున్నారు.

గతంలో ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వర్తిస్తుండగా అతనికి అక్కడడీసీపీ స్థాయి అధికారిణిగా పనిచేస్తున్న మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ సంతానం అయ్యాక తరచూగ బదిలీల సమస్య ఏర్పడటంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీనితో ఇద్దరు విడాకులు తీసుకోవాలని విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2015లో విడాకులు మంజూరు చేయగా, ఈలోపు వారికి మరో బిడ్డ పుట్టింది. పిల్లలు ఇద్దరు తల్లి దగ్గరే ఉన్నారు..

ఈ క్రమంలో తన పిల్లలను చూడటం కోసం అరుణ్ బెంగళూరు వసంత్ నగర్‌లోని తన మాజీ భార్య ఇంటికొచ్చారు. కానీ పిల్లలను చూడటానికి ఆమె అనుమతి ఇవ్వలేదు. దీంతో ఫుట్‌పాత్ మీద కూర్చొని నిరసనకు దిగారు. దీంతో ఆమె డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి పోలీసులు వచ్చి అక్కడినుంచి అరుణ్ ని వేల్లవలిసిందిగా కోరారు. కానీ తన పిల్లలను చూసేవరకు ఎక్కడికి వెళ్ళేది లేదని అరుణ్ చెప్పుకొచ్చాడు. ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్ కావడంతో పోలీసులు చేసేది ఏమి లేకా వెళ్ళిపోయారు.   

Tags:    

Similar News