అమెరికాలో 200 మంది తెలుగు విద్యార్థుల అరెస్ట్

Update: 2019-01-31 04:24 GMT

అమెరికా మిచిగాన్ రాష్ట్రంలో ఒక ఫేక్ యూనివర్సిటీ బండారం బయటపడింది. అందులో అడ్మిషన్ పొందిన పలువురు భారతీయ విద్యార్థులను యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. USCIS వర్సిటీలో ఎలాంటి డిపార్ట్‌మెట్లు లేకపోయినా.. ప్రొఫెసర్లు లేకపోయినా కూడా క్లాస్‌లు నిర్వహిస్తున్నట్టు చూపిస్తూ అడ్మిషన్లు ఇచ్చారు. ఈ క్రమంలో సుమారు 600 మంది విద్యార్ధులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో సుమారు 200 మంది తెలుగు విద్యార్థులున్నారు. మాస్టర్స్ పూర్తి చేసి హెచ్1బీ వీసాకు అప్లై చేసిన వారు చాలా మంది ఉన్నారు. దీంతో భారత్‌లో ఉన్న విద్యార్థుల తల్లీదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

Similar News