శతకోటి దీపోత్సవం.. ఒక్కటిగా నిలిచిన జనం!

కష్ట వేళలో ఒకరికొకరం తోడుగా ఉన్నాం. అందరం ఒక్కటే మాట మీద ఉన్నాం. మా దేశ నాయకత్వం మీద మాకు అపార నమ్మకం ఉంది.

Update: 2020-04-05 16:28 GMT

కష్ట వేళలో ఒకరికొకరం తోడుగా ఉన్నాం. అందరం ఒక్కటే మాట మీద ఉన్నాం. మా దేశ నాయకత్వం మీద మాకు అపార నమ్మకం ఉంది. మేమందరం కంటికి కనిపించని శత్రువును మా సంఘటిత శక్తితో ఎదుర్కుంటాం. ఈ చిమ్మ చీకట్లో కరోనా మహమ్మారికి మా సమైక్య వెలుగుతో హెచ్చరికను జారీ చేస్తున్నాం అంటూ యుద్ధ భేరి మోగించింది భారతావని. నూరుకోట్లకు పైగా దీపాలు మన దేశాన్ని ప్రపంచానికే వెలుగులు ప్రసాదించే మార్గదర్శిగా చూపించాయి. ప్రధాని మోడీ పిలుపు అందరిలో సమైక్య రాగాన్ని ఆలపించింది అఖండ భారత జనాళి.

కరోనా పోరులో సాముహిక శక్తిని చాటుతున్నారు దేశ ప్రజలు... ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు (ఏప్రిల్ 5) రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు టార్చ్ లైట్లు, ఫోన్ లైట్లు, అన్ చేసి మద్దతు తెలిపారు. యావత్ దేశం దీపాలతో వెలిగిపోయింది. ఇక ప్రగతి భవన్ లో తెలంగాణా సీఎం కేసీఆర్ దీపాలు వెలిగించి సంఘిభావం తెలియజేశారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంఘిభావం తెలియజేశారు. ఇకే రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు సైతం దీపాలు వెలిగించి సంఘిభావం తెలియజేశారు. ఇక పలు చోట్లల్లో గో కరోనా అంటూ నినాదాలు చేశారు.






Tags:    

Similar News