అమెరికాలో కాల్పులు...భయాందోళనలో ప్రజలు

Update: 2019-08-04 10:55 GMT

అమెరికాలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు.. గన్ కల్చర్ ను విచక్షణా రహితంగా వినియోగిస్తున్న దుండగులు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతకుంటున్నారు. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తోంది. బయటకు వెళ్లిన వారు ప్రజలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారన్న నమ్మకం లేదు.. తాజాగా 24 గంటల వ్యవధిలో అగ్రరాజ్యం అమెరికా రెండు సార్లు కాల్పుల ఘటనలతో దద్దరిల్లింది.. గన్ కల్పర్‌కి 30 నిండు ప్రాణాలు బలైయిపోయాయి.

టెక్సాస్‌ రాష్ట్రంలోని ఎల్‌పాసోలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. తుపాకులతో వాల్‌ మార్ట్ స్టోర్‌ లోకి చొరబడ్డారు. స్థానికులపై కాల్పులు జరిపారు. దీంతో 20 మంది మరణించారు. 26 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. ‎కొందరు దుండగులు విచక్షణ రహితంగా స్థానికులపై కాల్పులకు దిగారు. కాల్పుల సమయంలో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు పెట్టారు. దుండగుల్లో ముగ్గురు హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.. ఏడు రోజుల వ్యవధిలోనే టెక్సాల్ లో రెండోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

టెక్సాస్ లో కాల్పులు జరిగి 24 గంటలు కూడా గడవక ముందే.. ఒహాయో డేటస్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.. ఉన్మాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 10 మృతి చెందారు.. ప్రజలపై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపారు. వరుస కాల్పులతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు.. దుండగులు ఎందుకు కాల్పులకు తెగబడుతున్నారో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

Tags:    

Similar News