కరోనా నివారణ ప్రయత్నాలో ముందడుగు.. అమెరికా ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ICMR

Update: 2020-03-23 11:46 GMT
representative image

కరోనా నివారణకు కొత్త మందును కనుగొనే ప్రయత్నంలో ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు భారత్ కూడా వంత పాడుతోంది. కరోనాకు ఇప్పటి వరకూ మందే లేనందున యాంటీ మలేరియల్ డ్రగ్ వాడొచ్చంటూ అమెరికా చేసిన సూచనలకు ఇండియన్ మెడికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ మద్దతు పలికింది. ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు జరపడానికి 21 మంది సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తోంది.

హైడ్రాక్సి క్లోరోక్విన్ ను కరోనా కట్టడికి వాడొచ్చని ఈ సంస్థ కూడా సిఫారసు చేస్తూ దీనిపై మరిన్ని ప్రయోగాలు జరపాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇదే మందును ఇటలీలో కరోనా వైరస్ బారిన పడిన68 ఏళ్ల వృద్ధుడిపై ప్రయోగించారు ఆయనకు తగ్గడంతో ఈ మందుపై ఆశలు పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా హై రిస్క్ కరోనా పేషెంట్స్ కు ఈ డ్రగ్ వాడాలని ఐసీఎంఆర్ సూచించింది.


కరోనా కట్టడికి కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా దేశీయ విమానాల రాకపోకలను నిషేధించింది. రేపు అర్ధరాత్రి అన్ని దేశీయ విమానాల రాకపోకలు నిషేధించింది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాల్లో కోత విధించవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News