Ambani House: ప్రతినెలా అంబానీ ఇంటి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా..!!
Ambani House: ప్రతినెలా అంబానీ ఇంటి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా..!!
Ambani House Electricity Bill: భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల జాబితాలో స్థానం సంపాదించిన వ్యక్తి ముఖేష్ అంబానీ. ఆయన పేరు వినగానే రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ముంబైలోని ప్రతిష్ఠాత్మక నివాసం ఆంటిలియా కూడా గుర్తుకు వస్తుంది. ఈ భవనం కేవలం విలాసవంతమైన ఇల్లు మాత్రమే కాదు… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుకే ముఖేష్ అంబానీ గురించి మాట్లాడిన ప్రతిసారి ఆంటిలియా ప్రస్తావన తప్పనిసరిగా వస్తుంది.
ఫోర్బ్స్ జనవరి 4, 2025న విడుదల చేసిన నివేదిక ప్రకారం, ముఖేష్ అంబానీ నికర సంపద సుమారు 96.6 బిలియన్ డాలర్లు. దీంతో ఆయన ప్రపంచ ధనవంతుల జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. 2026లో ఆయన స్థానం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి కూడా అంతర్జాతీయంగా నెలకొంది.
ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్డుపై నిర్మితమైన ఆంటిలియా ఒక అద్భుత నిర్మాణం. మొత్తం 27 అంతస్తులు కలిగిన ఈ భవనంలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. జిమ్, స్పా, ప్రైవేట్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, యోగా కేంద్రం, ఆరోగ్య సంరక్షణ విభాగం, ప్రత్యేక ఆలయం వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, 150కు పైగా కార్లకు పార్కింగ్, విస్తృత టెర్రస్ గార్డెన్లు, మూడు హెలిప్యాడ్‌లు కూడా ఆంటిలియాకు ప్రత్యేక ఆకర్షణలు.
సుమారు 1.12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ భవనానికి 2006లో నిర్మాణం ప్రారంభమై 2010లో పూర్తయ్యింది. ఈ భూమిని ముఖేష్ అంబానీకి చెందిన ఆంటిలియా కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ 2002లో సుమారు 2.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
ఇంత భారీ భవనానికి నెలవారీ విద్యుత్ వినియోగం ఎలా ఉంటుందన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. పలు నివేదికల ప్రకారం, ఆంటిలియా ప్రతి నెలా సుమారు 6.3 లక్షల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగిస్తుంది. దీనివల్ల నెలకు వచ్చే విద్యుత్ బిల్లు సగటున రూ. 70 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. వినియోగం పరిస్థితులను బట్టి ఈ మొత్తం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.ఈ ఒక్క నెల విద్యుత్ ఖర్చుతోనే సాధారణంగా ఒక లగ్జరీ కారు కొనుగోలు చేయగలమంటే… ఆంటిలియా ఎంత భారీ స్థాయి జీవనశైలికి ప్రతీకో అర్థమవుతుంది.