Haryana: హర్యానాలో కొనసాగుతున్న హైటెన్షన్‌.. 144సెక్షన్‌ అమలు

Haryana: నుహ్‌లో నిందితుల అక్రమ నిర్మాణాల గుర్తింపు

Update: 2023-08-05 08:40 GMT

Haryana: హర్యానాలో కొనసాగుతున్న హైటెన్షన్‌.. 144సెక్షన్‌ అమలు

Haryana: హర్యానాలో చెలరేగిన అల్లర్లతో ఇంకా హైటెన్షన్‌ కొనసాగుతూనే ఉంది. నుహ్‌, గురుగ్రామ్‌లో కర్ఫ్యూ ఎత్తివేసినప్పటికీ నుహ్‌లో 144 సెక్షన్‌ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు అల్లరి మూకలను గుర్తించిన పోలీసులు వందల మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అల్లర్లలో పాల్గొన్న నేరస్తులకు చెందిన అక్రమ నిర్మాణాలను గుర్తించిన స్థానిక అధికారులు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో నుహ్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

Tags:    

Similar News