Republic Day Wishes: రిపబ్లికే డేకు మీ స్నేహితులకు, బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Update: 2025-01-26 01:17 GMT

Republic Day Wishes: భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం జనవరి 26న వేడుకగా జరగనుంది. మన దేశం గొప్ప చరిత్రకు, ప్రజాస్వామ్య సూత్రాల నిబద్ధతకు నిదర్శనంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. జనవరి 26వచ్చిందంటే ప్రతిచోటా దేశభక్తి వెల్లివిరుస్తుంది. 1950లో భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన రోజును స్మరించుకోవడానికి ఈ రోజును నిర్వహించుకుంటున్నాము. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం ముందు నిలిచిన రోజు ఇది.

మీరు మీ ప్రియమైన వారికి వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో రిపబ్లికే డే శుభాకాంక్షలు పంపించాలనుకుంటే ఈ కొటెషన్స్ చూడండి.

1. గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేద్దాం. భారతీయులుగా గర్విద్దాం. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

2. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను స్మరించుకుంటూ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుందాం. దేశ పురోభివ్రుద్ధికి కృషి చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

3. దేశ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కృషి చేసిన నాయకులందరి కోసం కష్టపడదాం. వారిలాగే దేశపురోగతి కోసం రాత్రింబవళ్లు పనిచేద్దాం.

4. గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఎగురవేసినప్పుడు మన వీర స్వాతంత్ర్యం సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం. వారికి నివాళులర్పిద్దాం. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

5. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశప్రగతికి పాడుపడదాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

6. మన దేశ గొప్ప వారసత్వాన్ని మరచిపోకుండా ఈ దేశంలో భాగమైనందుకు గర్విద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

7. భారతదేశానికి అంత సులభంగా స్వాతంత్రం రాలేదన్న విషయాన్ని మరిచిపోకూడదు. గతంలో లక్షలాది మంది యోధుల త్యాగల కథే ఇది. దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

Tags:    

Similar News