Delhi: ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీ వర్షం

Delhi: వర్షం కారణంగా తగ్గిన వాయు కాలుష్యం

Update: 2023-11-10 06:55 GMT

Delhi: ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీ వర్షం

Delhi: కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీకి పెద్ద ఊరట లభించింది. ఢిల్లీ- నోయిడాలోని పలు ప్రాంతాల్లో రాత్రిపూట భారీ వర్షం కురిసింది. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలో తగ్గుదల నమోదయ్యింది. అంతేకాకుండా, కాలుష్యం నుండి ప్రజలకు ఉపశమనం లభించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో AQI స్థాయి 400 నుంచి 100కి పడిపోయింది. ఢిల్లీలోని బవానా, కంఝవాలా, ముండకా, జాఫర్‌పూర్, నజఫ్‌గఢ్, నోయిడా, గ్రేటర్ నోయిడాలో వర్షాలు కురిశాయి. బహదూర్‌ఘర్, గురుగ్రామ్, మనేసర్ సహా ఎన్‌సీఆర్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని ఐఎండీ తెలిపింది. దీంతో పాటు హర్యానాలోని రోహ్‌తక్‌, ఖర్‌ఖోడా, మట్టన్‌హెల్‌, ఝజ్జర్‌, ఫరూఖ్‌నగర్‌, కోస్లీ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అర్థరాత్రి నుంచి నైరుతి ఢిల్లీ, ఎన్‌సీఆర్‌తో పాటు హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. గోహనా, గన్నౌర్, మెహమ్, సోనిపట్, ఖర్ఖోడా, చర్కి దాద్రీ, మట్టన్‌హెల్, ఝజ్జర్, ఫరూఖ్‌నగర్, కోస్లీ, సోహ్నా, రేవారి, బవాల్‌లో చినుకులు పడుతున్నాయి. రాజస్థాన్‌లోని భివాడిలో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఢిల్లీలో మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

Tags:    

Similar News