కృష్ణాజలాల వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

* నదిపై వేల కోట్ల ప్రాజెక్ట్‌లు చేపట్టిన కర్ణాటక

Update: 2023-01-11 03:54 GMT

కృష్ణాజలాల వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

Krishna River: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో ఇవాళ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించనున్నాయి. నిన్న కర్నాటక ప్రభుత్వం తరుపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. నదిపై వేల కోట్ల ప్రాజెక్ట్ లు చేపట్టినందుకు ట్రిబ్యునల్ అవార్డును అమలు చేయాలని కర్ణాటక తరపు న్యాయవాదులు కోరారు. కృష్ణా నది జలాలపై 13 వేల కోట్లతో కర్నాటక అక్రమంగా ప్రాజెక్ట్ లు చేపడుతుందని దానికి అనుగుణంగా నీటి కేటాయింపులు జరపాలని కర్నాటక కోరుతుందని తెలంగాణ ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. అంతేకాక అవార్డు అమలు నిలిపివేయాలని కూడా తెలంగాణ, ఏపీ న్యాయవాదులు, ధర్మాసనాన్ని కోరనున్నారు. 

Tags:    

Similar News