రైల్వే ప్రయాణికులకు శుభవార్త..
Trains: దసరా పండగ నేపథ్యంలో మరో తొమ్మిది ప్రత్యేక రైళ్లను.. నడిపించనున్నట్లు తెలిపిన దక్షిణ మధ్యరైల్వే
రైల్వే ప్రయాణికులకు శుభవార్త..
Trains: దసరా పండగ నేపథ్యంలో మరో తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్యరైల్వే తెలిపింది. ఈ నెల 20న ఓ ప్రత్యేక రైలు నాందేడ్ నుంచి కాకినాడకు వయా నిజామాబాద్, సికింద్రాబాద్, నల్గొండ మీదుగా వెళుతుంది. 24న మరొకటి హైదరాబాద్ నుంచి కటక్‌కు వయా నల్గొండ, గుంటూరు, విజయవాడ, దువ్వాడ మీదుగా ప్రయాణిస్తుంది. 25న కటక్ నుంచి హైదరాబాద్‌కు ఇదే మార్గంలో తిరిగి వస్తుంది. మిగిలిన రైళ్లు ఇతర మార్గాల్లో ఉన్నాయి.