భారీగా దిగొచ్చిన పసిడి ధర.. ఇప్పుడే కొనేయండి

Update: 2019-08-15 07:19 GMT

నిన్న మెన్నటి వరకు భగ్గుమన్న బంగారం ధరలు కొంత ఊరట కలిగించాయి. గురువారం పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఏకంగా రూ. 2,490 వరకు ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం ఒక్కరోజులోనే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2,490 తగ్గుదలతో రూ.37,000కు పతనమైంది. 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.360 తగ్గుదలతో రూ.35,760కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలమైనమైన ట్రెండ్ ఉన్నప్పటికీ రికార్డుస్థాయిల వద్ద ఇన్వెస్టర్ల అమ్మకాలు, జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ వెండి మాత్రం అలాగే ఉండిపోయింది. కిలో వెండి ధర రూ. 47,265 పలుకుతోంది. పదిరోజులు వరుసగా పైపైకి ఎగబాకిన పసిడి.. ఇప్పుడు ఒక్కసారిగా రూ.2,500 తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పసిడి ధరలు దిగిరావడంతో ఆభరణాలు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

Tags:    

Similar News