Manmohan Singh last rites: నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు..తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరు
Manmohan Singh last rites: భారీ మాజీ ప్రధాని, భారత ఆర్థిక సంస్కరణల సృష్టికర్త అయిన మన్మోహన్ సింగ్ ఇక లేరనే వార్తను జీర్ణంచుకోలేకపోతున్నారు. వివాదరహిత నేతగా గుర్తింపు పొందిన మన్మోహన్ సింగ్ మరణంపై అన్ని పార్టీల నేతలూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోతున్నాయి. వీటికి కేంద్ర పెద్దలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ సంతాపం తెలుపుతూ 7 రోజుల కేంద్ర సంతాప దినాలు ప్రకటించింది.
ప్రస్తుతం మన్మోహణ్ పార్థీవదేహం మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని ఆయన నివాసంలో ఉంది. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 8.30 నుంచి 9.30 వరకు ఆయన పార్థీవ దేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచుతారు. ఉదయం 9.30గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని కాంగ్రెస్ తెలిపింది. ఉదయం 11.45కి అంత్యక్రియలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.