Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

Vande Bharat Express: మధ్యప్రదేశ్‌ కేథోరా రైల్వే స్టేషన్‌లో ప్రమాదం

Update: 2023-07-17 06:25 GMT

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడం ఒక్కసారిగా కలకలం రేపింది. మధ్యప్రదేశ్ కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన ట్రైన్ నుంచి దిగిపోయారు. వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సోమవారం ఉదయం వందే భారత్‌ రైలు భోపాల్‌ నుంచి ఢిల్లీ బయలు దేరింది.

రైలు కుర్వాయి స్టేషన్ వద్దకు రాగానే బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే సమాచారాన్ని లోకో పైలట్‌కు అందించారు. దీంతో రైలును అక్కడే నిలిపివేశారు. ప్రయాణీకులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి గాయాలు కాలేదని ఇండియన్ రైల్వే ప్రకటించింది.

Tags:    

Similar News