వెస్ట్‌బెంగాల్ సిలిగురిలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఇళ్లు.. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలు
Fire Accident: ప్రమాదంలో అగ్నిమాపక శాఖ ఉద్యోగితో పాటు ఐదుగురు స్థానికులు గాయపడ్డారు
వెస్ట్‌బెంగాల్ సిలిగురిలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఇళ్లు.. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలు
Fire Accident: పశ్చిమ బెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిలిగురి బగార్‌కోట్ స్లమ్ కాలనీలో ఇళ్లన్నీ కాలి బూడిదయ్యాయి.. ప్రమాదంలో అగ్నిమాపక శాఖ ఉద్యోగితో పాటు ఐదుగురు స్థానికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా ఎగిసిపడ్డ మంటల్లో ఇళ్లలోని సామాన్లన్నీ కాలిపోయాయి. ఇళ్ల పట్టాలు.. సర్టిఫికెట్లు, వివిధ ఐడీ కార్డులు, ఆహారధాన్యాలు.. మొత్తం బుగ్గిపాలయ్యాయి. సర్వం కోల్పోయిన ప్రజలంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. తాగునీరు, తినడానికి తిండి లేక అష్టకష్టాలు పడుతున్నారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు.. అయితే ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.