అరుణ్ జైట్లీ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

Update: 2019-08-24 07:10 GMT

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ (66) కన్నుమూశారు. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు జైట్లీని హుటాహుటినా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ, అరుణ్ జైట్లీ దక్కలేదు. అరుణ్ జైట్లీ మరణాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. 1952, నవంబర్‌ 28న న్యూఢిల్లో జైట్లీ పుట్టారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే కీలకమైన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలను కేంద్రం తీసుకొచ్చింది. అరుణ్ జైట్లీ మరణ వార్తతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి.



Tags:    

Similar News