జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు ...ఓ ఉగ్రవాది, పోలీసు మృతి

జమ్ముకాశ్మీర్‌లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బారాముల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారితో పాటు ఉగ్రవాది హతమయ్యాడు.

Update: 2019-08-21 04:59 GMT

జమ్ముకాశ్మీర్‌లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బారాముల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారితో పాటు ఉగ్రవాది హతమయ్యాడు. బారాముల్లా జిల్లా కాకర్ హుమా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు భద్రతా బలగాలతో కలిసి గాలింపు చేపట్టారు. బారాముల్లాలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.  

Tags:    

Similar News