Ranjeet Ranjan: ప్రధాని దయాదాక్షిణ్యాలతో బిల్లుకు పేరు రాలేదు..
Ranjeet Ranjan: మహిళల పోరాటాల వల్లనే బిల్లుకు పేరు
Ranjeet Ranjan: ప్రధాని దయాదాక్షిణ్యాలతో బిల్లుకు పేరు రాలేదు..
Ranjeet Ranjan: చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో హాట్ హాట్‌గా చర్చ సాగింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రంజీత్ రంజన్ తీవ్ర విమర్శలు చేశారు. బిల్లును స్వాగతిస్తున్నామంటూనే బిల్లుకు పెట్టిన నారీశక్తి వందన్ పేరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బిల్లుకు నారీ శక్తి వందన్ పేరు పెట్టడం ప్రధానికి దయా దాక్షిణ్యాలతో కాదని.. గతంలో మహిళలు చేసిన పోరాటాల వల్లనే బిల్లుకు ఆ పేరు పెట్టారన్నారు. జంతర్ మంతర్‌లో మహిళలు ధర్నా చేసినప్పుడు,. మణిపూర్‌లో మహిళను వివస్త్రను చేసినప్పుడు మీ ప్రేమ చూపించాల్సింది అని చురకలు అంటించారు.