రోడెక్కిన ఢిల్లీ పోలీసులు.. న్యాయం కావాలంటూ మెరుపు సమ్మె

Update: 2019-11-05 12:03 GMT

న్యాయం కావాలంటూ ఢిల్లీ పోలీసులు రోడెక్కారు. తీస్ హజారియా కోర్టులో జరిగిన ఘటనలో తమకు న్యాయం కావాలంటూ పోలీసులు మెరుపు సమ్మెకు దిగారు. రోడ్డుపై బైఠాయించి, యూనిఫామ్ లోనే ఆందోళన చేపట్టారు. లాయర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఢిల్లీలో లాయర్లు, పోలీసులకు మధ్య తలెత్తిన ఘర్షణ రోజురోజుకు ఉధృతమవుతోంది. ఢిల్లీ పోలీసులు, అధికారులు పోలీసు ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు దిగారు. న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈనెల 2న తీస్‌ హజారీ కోర్టు, 4న సాకేత్‌ కోర్టులో జరిగిన ఘర్షణకు కారణమైన లాయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులు ఇవాళ మెరుపు సమ్మెకు దిగారు.

ఈ ఘర్షణలకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటి ఆధారంగా తప్పెవరిదో తేల్చి చర్యలు తీసుకోవాలని పోలీసులు డిమాండ్‌ చేస్తున్నారు. ఢిల్లీ పోలీసుల ఆందోళనకు ఐపీఎస్‌ అసోసియేషన్‌ బాసటగా నిలిచింది. మరోవైపు వెంటనే నిరసన ప్రదర్శనలు ఆపేసి విధుల్లో చేరాలని పోలీసులను ఉన్నతాధికారులు కోరారు. 

Tags:    

Similar News