Arvind Kejriwal: మరో వివాదంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..!
Arvind Kejriwal: రూ.45 కోట్లు ఖర్చు చేశారని ఆరోపిస్తున్న బీజేపీ
Arvind Kejriwal: మరో వివాదంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..!
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. కేజ్రీవాల్ అధికారిక నివాసం సుందరీకరణ కోసం.. 45 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్ సివిల్ లైన్స్‌లో కేజ్రీవాల్ అధికారిక నివాసం ఉంది. కోవిడ్ సమయంలో అభివృద్ధి పనులు నిలిచిపోయి.. ప్రజలు ఇబ్బందులు పడ్డ సమయంలో తన బంగ్లా సుందరీకరణ కోసం.. 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కేజ్రీవాల్.. సమాధానం చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి నైతిక బాధ్యత వహిస్తూ.. కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటున్నారు.