ఈ ఏడాది ఏడు శాతం వృద్ధి ఖాయం

Update: 2019-07-04 10:32 GMT

ఈ సంవత్సరం 7 శాతం వృద్ధి తప్పనిసరిగా సాధిస్తామని ఆర్ధిక సర్వేలో పేర్కొన్నారు. బడ్జెట్ ముందు ప్రవేశ పెట్టె ఆర్ధిక సర్వ్ వివరాలను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 2018 - 2019 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు గణనీయంగా పెరగనున్నట్టు ఆ సర్వేలో పేర్కొన్నారు. ముఖ్య ఆర్ధిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ ఈ సర్వే వివరాలను తయారు చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొని వున్నఆర్ధిక పరిస్థితులను చెబుతూనే.. మన ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళను ఈ సర్వ్ ప్రస్తావించింది. 

ఆర్థిక సర్వేలోని కీలక అంశాలు ఇవే 

2020 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.  

  డిమాండ్‌, రుణ లభ్యత పెరగడంతో 2020లో పెట్టుబడుల వృద్ధి రేటు కూడా పెరిగే అవకాశం ఉంది.

వ్యయాలు పెరగడం, ప్రైవేటు పెట్టుబడుల్లో వృద్ధి కారణంగా 2019-20లో జీడీపీ వేగంగా పెరుగుతుంది. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మందగమనం, వాణిజ్య ఘర్షణలు పెరగడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. 

భారత్‌ 2025నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మాత్రం వృద్ధి రేటు ఇప్పటి నుంచే 8శాతం దాటాలి. 

చమురు ధరలు అందుబాటులో ఉండటం వల్ల వినిమయ శక్తి పెరగవచ్చు. ఈ ఏడాది చమురు ధరలు తగ్గవచ్చు.

పెట్టుబడుల రేటు 2011-12 నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2019-20 నుంచి మళ్లీ పెట్టుబడుల రేటు పెరిగే అవకాశం ఉంది. 

⊗  గ్రామీణ ప్రాంతాల్లో వేతనాల్లో వృద్ధి కనిపించే అవకాశం ఉంది. 2018 వరకు వీటిలో వృద్ధి నిలిచిపోయింది. ఆ తర్వాత నుంచి పెరుగుదల కనిపిస్తోంది.

  వృద్ధిరేటులో మందగమనం, జీఎస్‌టీ, వ్యవసాయ పథకాల ఒత్తిడి ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. 

  దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం పెట్టుబడుల వాతావరణాన్ని పెంచుతుంది.

ఎఫ్‌డీఐల నియంత్రణ తగ్గించేలా ప్రభుత్వ పాలసీలు ఉండే అవకాశం ఉంది. 

ఈ ఏడాది ద్రవ్యలోటు తగ్గి 5.8శాతం ఉండొచ్చు. అదే 2018లో 6.4శాతంగా ఉంది. 

మొండిబాకాయిలు తగ్గుముఖం పట్టడం.. మూలధన వ్యయాల పెంపునకు సహకరించవచ్చు.

Tags:    

Similar News