అసోంలో బీభత్సం సృష్టిస్తోన్న సూపర్‌ సైక్లోన్‌

Update: 2019-10-29 06:28 GMT

ముంచుకువస్తున్న క్యార్రా తుపాన్ ముప్పుతో మత్స్యకారులు వణుకుతున్నారు. అసోంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు భీకర శబ్దంతో ఎగసిపడుతున్న అలలకు ప్రాణాలు అరచేతపట్టుకుని ఒడ్డుకు చేరుకున్నారు. సుడులు తిరుగుతూ ఎగసిపడుతున్న అలలకు వేటగాళ్లు గజగజవణికిపోయారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన క్యార్రా వాయుగుండం సూపర్‌ సైక్లోన్‌గా మారి ముంబై , ఒమన్‌ల మధ్య కేంద్రీకృతమైందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 160 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. 

Tags:    

Similar News