Coronavirus: సిక్కింలో తొలి కరోనా కేసు!

ఇప్పటివరకు దేశంలో కోవిడ్ లేని ఏకైక రాష్ట్రంగా ఉన్న సిక్కిం పేరు పొందింది.

Update: 2020-05-24 03:06 GMT
Representational Image

ఇప్పటివరకు దేశంలో కోవిడ్ లేని ఏకైక రాష్ట్రంగా ఉన్న సిక్కిం పేరు పొందింది.కానీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా కరోనా కాలు మోపింది. అక్కడ తోలి కేసు నమోదు అయింది. ఇటివల మే 17 న ఢిల్లీ నుంచి వచ్చిన ఓ 25 ఏళ్ల యువకుడికి కరోనా లక్షణాలు కనిపించగా అతనిని ఆసుపత్రికి తరలించి పరీక్షించాగా అతడికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా తేలింది. అంతేకాకుండా అతనిని కలిసిన వారిని కూడా అధికరులు గుర్తించే పనిలో పడ్డారు. ఈ విషయాన్ని సిక్కిం ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ పిటి భూటియా వెల్లడించారు. ఇక గత నాలుగు నెలలుగా ఒక కొరోనా కేసు లేని రాష్ట్రముగా సిక్కం నిలిచింది. ఇక అటు మరో ఈశాన్య రాష్ట్రాలు అయిన అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలలో ఇప్పటిదాకా ఒక్కొక్క కేసు నమోదు అయింది.

ఇక అటు దేశంలో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,25,101కి చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 69,597 మంది చికిత్స పొందుతుండగా, 51, 783 మంది కోలుకున్నారని, 3720 మంది మరణించారని వెల్లడించింది. ఇక రాష్ట్రాల వారిగా చూసుకుంటే తమిళనాడులో 759, ఢిల్లీలో 591, కర్ణాటకలో 196, రాజస్థాన్‌లో 163, బీహార్‌లో 179, ఒడిశాలో 80, అస్సాంలో 60, ఆంధ్రప్రదేశ్‌లో 47 గా ఉన్నాయి.  

Tags:    

Similar News