మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం : కరోనా వచ్చిన పోలీసుల చికిత్స కోసం లక్ష రూపాయలు

కరోనా వైరస్ పై పోరాడుతున్న పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2020-04-21 16:27 GMT
Representational Image

కరోనా వైరస్ పై పోరాడుతున్న పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులకి ఎవరికైనా కరోనా వస్తే చికిత్స కోసం తక్షణమే వారి ఖాతాలో రూ. లక్ష జమచేయాలని నిర్ణయించింది. పోలిస్ సంక్షేమ నిధి నుంచి ఈ మొత్తం డిపాజిట్ చేయాలనీ DGP ఆదేశించారు. దీనికి అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (అడ్మినిస్ట్రేషన్) సంజీవ్ కుమార్ సింఘాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మహారాష్ట్రలో ఇప్పటివరకు ఎనమిది అధికారులు సహా 37 మంది పోలీసులకి కరోనా వచ్చింది. ఈ పోలీసు సిబ్బందిలో ఎక్కువ మంది ముంబైకి చెందినవారు కావడం విశేషం.. లాక్ డౌన్ సమయంలో విధులు నిర్వర్తించే సమయంలో వీరికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులు నమోదు అయిన రాష్ట్రంగా గుర్తించబడింది.


Tags:    

Similar News