కరోనా కట్టడిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న కేరళ

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 829 కరోనా కేసులు నమోదు కాగా.. 28 మంది ప్రాణాలు కోల్పోయారు.

Update: 2020-04-16 17:17 GMT
Representational Image

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 829 కరోనా కేసులు నమోదు కాగా.. 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,759కి చేరింది. ఇక ఇప్పటివరకు దేశంలో 420 మంది చనిపోగా, ఇప్పటి వరకూ 1515 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

కానీ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ పై కేరళ వైద్యులు విజయం సాధిస్తున్నారు... కరోనా వైద్యులకి అక్కడ మెరుగైన చికిత్స అందిస్తున్నారు. దీనితో రోజురోజుకి కరోనా కేసులు అక్కడ తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం కేరళలో 387 కరోనా కేసులు నమోదు కాగా అందులో 218 మంది కోలుకున్నారు. ఇదే అక్కడి వైద్యులు సాధించిన విజయంగా అభివర్ణించవచ్చు..మిగిలిన 167 మందికి అత్యుత్తమ వైద్యం అందిస్తున్నారు. ఇద్దరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు... దీంతో కేరళ ఇతర రాష్ట్రాలకు, బయటి దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 


Tags:    

Similar News