ప్రధాని మోడీ సంచలన నిర్ణయం.. ఎంపీల జీతాల్లో భారీగా కోత

Update: 2020-04-06 10:33 GMT
Narendra Modi (File Photo)

కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని మోడీతో పాటు ఎంపీల జీతాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించారు. ప్రధాని మోడీతో పాటు ఎంపీలందరి జీతాల్లో ఈ నెల నుంచి ఏడాది పాటు కోత విధించనున్నట్టు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వెల్లడించారు. రెండేళ్ల పాటు ఎంపీ ల్యాడ్స్‌ నిధులు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్ సభ్యులు జీతాలు, పెన్షన్ల చట్టం-1954ని సవరిస్తూ సోమవారం కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ సోమవారంనాడు మీడియాకు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుత స్థితిని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తూ తమ వేతనాల్లోనూ కోతకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని చెప్పారు. రెండేళ్ల ఎంపీ లాడ్స్ మొత్తంగా వచ్చే రూ.7,900 కోట్లతో ఒక నిధిని (కన్సాలిడేటెడ్ ఫండ్) ఏర్పాటు చేస్తామని జవదేకర్ తెలిపారు.

Tags:    

Similar News