Cigarette Price Shock: రేట్లు 40% పెరిగే ఛాన్స్.. అప్పుడే 'స్టాక్' మాయం చేసిన డీలర్స్!

జీఎస్టీ పెంపు నేపథ్యంలో సిగరెట్ల ధరలు 40% పెరిగే అవకాశం ఉంది. ఈ లోపే డీలర్లు సిగరెట్లను బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఐటీసీ సిగరెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి.

Update: 2026-01-07 09:32 GMT

జీఎస్టీ కౌన్సిల్ త్వరలో సిగరెట్లపై పన్నులు పెంచబోతుందనే వార్తలు బయటకు రావడంతో, సిగరెట్ డీలర్లు తమ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీసీ (ITC) కంపెనీకి చెందిన పాపులర్ బ్రాండ్ల సిగరెట్లను మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం.

ఏం జరుగుతోంది?

బ్లాక్ మార్కెట్ దందా: జీఎస్టీ పెంపు వల్ల సిగరెట్ల ధరలు ఏకంగా 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో పాత స్టాక్ తక్కువ ధరకు అమ్మడం ఇష్టం లేని డీలర్లు, షాపుల యజమానులు "స్టాక్ లేదు" అంటూ బోర్డులు తిప్పేస్తున్నారు.

భారీగా పెరగనున్న ధరలు: ప్రస్తుతం రూ. 170 ఉన్న సిగరెట్ ప్యాకెట్ ధర, పన్నుల పెంపు తర్వాత ఏకంగా రూ. 250కి చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.

లాభాల వేట: ఒక్కో ప్యాకెట్‌పై రూ. 60 నుండి రూ. 70 వరకు అదనపు లాభం వస్తుందనే ఆశతో, పాత స్టాక్‌ను గోడౌన్లలో దాచేస్తున్నారు. కొత్త ధరలు అమల్లోకి రాగానే వీటిని బయటకు తీసి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

కడప జిల్లాలో వెలుగులోకి..

తెలుగు రాష్ట్రాల్లో ఐటీసీ సిగరెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా కడప జిల్లాలో కొందరు డీలర్లు సిగరెట్లను బ్లాక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిటైల్ వ్యాపారులు కంపెనీ నుండి స్టాక్ రావడం లేదని చెబుతుంటే, అసలు విషయం మాత్రం ధరల పెంపు కోసమేనని తెలుస్తోంది.

ప్రభుత్వ నిఘా అవసరం:

ప్రభుత్వం అధికారికంగా ధరలు పెంచకముందే, డీలర్లు ఇలా కృత్రిమ కొరత సృష్టించడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టి, అక్రమ నిల్వలను వెలికితీయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News