రెండో అంతస్తు నుండి జారి పడిన చిన్నారి... త్రుటిలో తప్పిన ప్రమాదం

రెండో అంతస్తులో చిన్నారి ఆడుకుంటూ రిక్షాలో జారి పడి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ సంఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Update: 2019-10-20 10:46 GMT

రెండో అంతస్తులో చిన్నారి ఆడుకుంటూ రిక్షాలో జారి పడి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ సంఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెలితే మధ్యప్రదేశ్ టికంగఢ్ లోని ఓ భవనంలో రెండో అంతస్థులో చిన్నారి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో చిన్నారి సమీపంలో పెద్దవారు ఎవరూ లేకపోవడంతో ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. చిన్నారి అదృష్ట వశాత్తు తను కిందపడే సమయానికి అక్కడ నుంచి ఒక రిక్షా వెళ్లడంతో చిన్నారి నేరుగా రిక్షాలో పడ్డాడు. దీంతో ఆ చిన్నారి స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్ల ఫోన్లలో వైరల్ అవుతోంది.




Tags:    

Similar News