Bihar: బోరుబావిలో పడిన చిన్నారి.. బయటకు తీసేందుకు ప్రయత్నాలు
Bihar: ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా అధికారులు
Bihar: బోరుబావిలో పడిన చిన్నారి.. బయటకు తీసేందుకు ప్రయత్నాలు
Bihar: బీహార్‌లో ఓ చిన్నారి బోరుబావిలో పడిన ఘటన వెలుగుచూసింది. నలంద జిల్లాలోని కుల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారి పొలంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయినట్లు తెలుస్తోంది. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. NDRF బృందాలతో చిన్నారిని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.