CS of West Bengal: బెంగాల్ సీఎస్ కు రీకాల్ కై కేంద్రం ఆదేశం
CS of West Bengal:పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలపన్ బందోపాధ్యాయ ని కేంద్రం రీకాల్ చేసింది.
Mamata Banerjee:(File Image)
CS of West Bengal: పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలపన్ బందోపాధ్యాయ ని కేంద్రం రీకాల్ చేసింది. ఈ నెల 31 న అయన ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయం లో గల పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. యాస్ తుపాను వల్ల కలిగిన నష్టంపై చర్చించేందుకు ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి సీఎం మమతా బెనర్జీ గైర్ హాజరు కావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. అందువల్లే ఈ చర్య తీసుకుంది.
1987 కేడర్ ఐఏఎస్ అధికారి అయిన బందోపాధ్యాయను సెంటర్ గతంలో బెంగాల్ రాష్ట్రానికి డెప్యూట్ చేసింది. కాగా ఈయన పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 న నోటిఫికేషన్ జారీ చేసి ఇందుకు అనుమతి కోసం ఈ ప్రతిపాదనను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపింది.