విశ్వాస పరీక్షలో నెగ్గిన యడియూరప్ప..

Update: 2019-07-29 06:28 GMT

కర్నాటక విధాన సౌధ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కర్ణాటక అసెంబ్లీలో యడియూరప్ప సర్కార్ విశ్వాస పరీక్షలో నెగ్గింది. 207 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 104కు అవసరం ఉండగా.. బీజేపీకి ఎమ్మెల్యేలు 105 మంది ఉండగా.. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతు ఇచ్చారు. మొత్తం 106 మంది ఓటేయ్యడంతో యడియూరప్ప బలం మేజిక్ ఫిగర్ ను దాటేసింది.విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా 100 ఓట్లు వచ్చాయి. బలపరీక్ష అనంతరం సభలో ఆర్థిక బిల్లును యడ్యూరప్ప సర్కార్ ప్రవేశపెట్టనుంది. విశ్వాస పరీక్షలో నెగ్గిన బీజేపీ... ఇక ఇప్పుడు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని రెడీ అవుతోంది. అందువల్లే విశ్వాస పరీక్షకు ఒక రోజు ముందే స్పీకర్ ఈ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News