పెను విషాదం : నదిలో పడవ బోల్తా.. ఏడుగురు మృతి, 14 మంది గల్లంతు..

నదిలో పడవ బోల్తా.. ఏడుగురు మృతి, 14 మంది గల్లంతు.. నదిలో పడవ బోల్తా.. ఏడుగురు మృతి, 14 మంది గల్లంతు.. నదిలో పడవ బోల్తా.. ఏడుగురు మృతి, 14 మంది గల్లంతు..

Update: 2020-09-16 08:27 GMT

రాజ‌స్తాన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. కోటా జిల్లా ఎటావా సమీపంలోని చంబల్ నదిలో బుధవారం ఉదయం పడవ బోల్తాపడి ఏడుగురు మృతిచెందారు. మరో 14 మంది గ‌ల్లంత‌య్యారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. పడవ డ్రైవర్ ఈదుకుంటూ నాదినుంచి ప్రాణాలతో బయటపడ్డారు. పడవలో సామర్ధ్యానికి మించి ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది ఏడుగురు మృతదేహాలను నదినుంచి బయటకు తీశారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. గల్లంతైన వారికోసం ప్రత్యేక బృందాలతో నదిని జల్లెడ పడుతున్నారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో ప‌డ‌వ‌లో మొత్తం 25 నుంచి 30మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, పడవలో 14 బైక్‌లను కూడా ఉంచినట్లు స్థానికులు చెబుతున్నారు.

సంఘటన జరిగిన వెంటనే, ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు మునిగిపోతున్న వారిని రక్షించడానికి ప్రయత్నించారు. అయితే, ప్రవాహం తీవ్రతరం కావడంతో కొంతమందిని మాత్రమే రక్షించారు. పడవ కమలేశ్వర్ ధామ్‌ ప్రాంతానికి వెళుతోండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది గోతారాకళ ప్రాంతానికి చెందినవారని తెలిపారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలకు సహాయం ప్రకటించారు. కోటా ఎంపి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు.    

Tags:    

Similar News