పోకిరీకి దేహశుద్ధి చేసిన చంచల్‌

దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ మహిళలపై, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.

Update: 2019-12-11 06:05 GMT
మహిళా కానిస్టేబుల్‌ చంచల్ చౌరాసియా

దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ మహిళలపై, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం ముందంజలో ఉంది. దీంతో అక్కడి ప్రభుత్వం, పోలీస్ శాఖ కఠిన చర్యలను తీసుకుంటుంది. ఎక్కడయినా అమ్మాయిను వేధిస్తున్నట్టు వారికి సమాచారం అందితే చాలు ఆ ఆకతాయితను పోలీసులు పట్టుకుని చితకబాదుతున్నారు. వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌, బీతూర్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. పాఠశాలకు వెలుతున్న బాలికను ఓ ఆకతాయి దారిలో అడ్డగించి అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించడం మొదలు పెట్టాడు. అదే ప్రాంతంలో ఉన్నబీతూర్ పోలీస్ స్టేషన్‌లోని యాంటీ రోమియో స్క్వాడ్‌ మహిళా కానిస్టేబుల్‌ చంచల్ చౌరాసియా ఆ సంఘటనని గమనించింది. వెంటనే అక్కడికి చేరుకుని ఆ ఆకతాయి కాలర్ పట్టుకుని వాయించింది. అంతే కాదు తన బూటు తీసీ దేహశుద్ధి చేసింది. ఆ తరువాత నిందితుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.





Tags:    

Similar News