అరె అచ్చం ట్రాపిక్ పోలిసే.. కానీ కాదుగా

ట్రాఫిక్ పోలీసులకి, బొమ్మలకి పెద్ద తేడా ఏమి ఉండదని, దీనితో ట్రాఫిక్ నియమాలపై వాహనదరులకి అవగాహన పెంచేందుకు

Update: 2019-11-25 14:57 GMT
Traffic police

ట్రాపిక్ రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు వాహనలను నడిపే వాహనదారులను ఓ పద్ధతిలోకి తీసుకువచ్చేందుకు కర్ణాటక ట్రాఫిక్ పోలిసులు వినూత్నంగా అలోచించారు. అచ్చం ట్రాపిక్ పోలిసుల లాగానే కనిపించే 30 ట్రాఫిక్ బొమ్మలను పలు జంక్షన్ల వద్ద నిలబెట్టారు. దూరం నుండి వచ్చే వాహనదరులు ఇవి చూసి వెంటనే అప్రమత్తం అయ్యే అవకాశాలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కేవలం ఒక చోటున మాత్రమే కాకుండా పలు చోట్లలోకి మారుస్తామని తద్వారా ట్రాఫిక్ పోలీసులకి, బొమ్మలకి పెద్ద తేడా ఏమి ఉండదని, దీనితో ట్రాఫిక్ నియమాలపై వాహనదరులకి అవగాహన పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అచ్చం ట్రాఫిక్ పోలీసులను తలపించేలా వైట్ కలర్ షర్ట్ , ఖాకి కలర్ పాయింట్ , బ్లాక్ షూస్ తో ఉండే బొమ్మలను తయారు చేశారు. ట్రాఫిక్ పోలీసులు తలపెట్టిన ఈ ప్రయత్నానికి నెటిజన్ల నుండి మంచి స్పందన వస్తుంది.  

Tags:    

Similar News