Bengal Panchayat Elections: పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల్లో రీపోలింగ్..

Bengal Panchayat Elections: రెండు రోజుల క్రితం జరిగిన పోలింగ్‌లో చెలరేగిన హింస.. హింసలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది

Update: 2023-07-10 08:48 GMT

Bengal Panchayat Elections: పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల్లో రీపోలింగ్.. 

Bengal Panchayat Elections: పశ్చిమబెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌ రోజున పెద్దఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. భారీగా కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ భారీ హింస జరిగింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు, బ్యాలెట్‌ పేపర్లు తగలబెట్టడాలు, దొంగ ఓట్లు, పోలింగ్‌ బాక్సులు ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు భారీగా జరిగాయి. ఇక పోలింగ్‌ రోజు జరిగిన హింసలో పలువురు మరణించారు. దీంతో హింసాత్మక ఘటనలు జరిగిన 19 జిల్లాల్లోని 697 పోలింగ్ కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం రీ పోలింగ్‌ నిర్వహిస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.

Tags:    

Similar News