Bank Employees: ఈ నెలలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఎప్పుడో తెలుసా..?

Bank Employees: బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా ఉద్యోగులు ఈ నెలలో ధర్నాకు సిద్దమవుతున్నారు.

Update: 2021-12-02 05:22 GMT

ఈనెలలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె (ఫైల్ ఇమేజ్)

Bank Employees: బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా ఉద్యోగులు ఈ నెలలో ధర్నాకు సిద్దమవుతున్నారు. డిసెంబర్ 16, 17 తేదీలలో రెండు రోజుల సమ్మె చేయనున్నారు. ఈ విషయాన్ని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU-United Forum of Bank Unions) ప్రకటించింది. ఇందులో తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, యూనియన్ల సభ్యులు పాల్గొంటారు. ఇందులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి.

ఫిబ్రవరి 2021న సమర్పించిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం ప్రైవేటీకరణకు కోసం ఈ బ్యాంకుల ఉద్యోగులకు ఆకర్షణీయమైన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని (VRS) తీసుకురావచ్చు.

గతంలో ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంక్‌ని ప్రైవేట్‌ పరం చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్యాంక్ 1960లో ప్రారంభమైంది. అప్పుడు దాని పేరు డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌గా ఉండేది. తర్వాత దాన్ని ఐడీబీఐ బ్యాంక్‌గా మార్చారు. ప్రభుత్వ బీమా కంపెనీ ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు దాని పెట్టుబడుల ఉపసంహరణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే బ్యాంక్‌లో వాటాను తగ్గించుకుంటామని ఎల్‌ఐసి బోర్డు తీర్మానం చేసింది. 

Tags:    

Similar News