ఈనెల 5న హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతల స్వీకరణ

తెలంగాణకు చెందిన సీనియర్ నేత బండారు దత్తాత్రేయ గిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియామకం అయిన విషయం తెలిసిందే. తాజాగా నిన్న ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు.

Update: 2019-09-03 01:51 GMT

తెలంగాణకు చెందిన సీనియర్ నేత బండారు దత్తాత్రేయ గిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియామకం అయిన విషయం తెలిసిందే. నిన్న ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 4న హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్తానని, 5న అక్కడ ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పుకొచ్చారు. సమైక్యతకు ఎటువంటి ఆటంకాలూ కలగకుండా చూడాలని గణనాధుని వేడుకున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యాలయం బాధ్యతలు చేపట్టే ముందు భగవంతుడి ఆశీర్వాదాలతో అంతా చక్కగా సాగాలి" అని దేశంలో సమగ్రతను, సంస్కృతిని ప్రోత్సహించాలని ప్రభువును ప్రార్థించానని దత్తాత్రేయ అన్నారు.కల్రాజ్ మిశ్రా స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది. మిశ్రా రాజస్థాన్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 

Tags:    

Similar News