పౌరసత్వ బిల్లు ఎఫెక్ట్‌: అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రాలు

Update: 2019-12-10 07:20 GMT
ఆందోళన

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడికిపోయాయి. ముఖ్యంగా చైనా, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, భూటాన్‌లతో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకున్న అసోం, త్రిపురలలో ప్రజలు ఆందోళనలు బాట పట్టారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తే తమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందంటూ నిరసనలు చేపట్టారు. పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి వచ్చి ప్లకార్డులతో నినాదాలు చేశారు.

నిన్న లోక్‌సభలో సుదీర్ఘ చర్చ అనంతరం పౌరసత్వ బిల్లు పాస్ అయ్యింది. మొత్తంగా 391 ఓట్లు పోలవగా, అందులో బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. ఒక్కోక్క అమెండ్‌మెంట్ ప్రకారం ఓటింగ్ స్వీకరించిన స్పీకర్ బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. 

Tags:    

Similar News