కరోనాను కట్టడి చేసేందుకు మరో కొత్త వ్యాక్సిన్

వ్యాక్సిన్‌ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ

Update: 2023-01-26 11:33 GMT

Nasal Vaccine: కరోనాను కట్టడి చేసేందుకు మరో కొత్త వ్యాక్సిన్

Nasal Vaccine: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశంలోనే తొలిసారిగా నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దేశంలో తొలి ఇంట్రానాసల్ కొవిడ్ వ్యాక్సిన్ ఇంకోవాక్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ రిపబ్లిక్ డే సందర్భంగా లాంఛ్ చేశారు. ఇంకోవాక్ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిది. గతవారంలో కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా ఎల్లా రిపబ్లిక్ డే సందర్భంగా వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గతేడాది డిసెంబర్‌లో బూస్టర్‌ డోసుగా వేసేందుకు డీజీఐసీ అత్యవసర వినియోగానికి అనపుమతి ఇచ్చింది. అయితే టీకాను ప్రభుత్వానికైతే 325 రూపాయలకు, ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలకు 800 రూపాయలకు విక్రయించినున్నట్లు భారత్ బయోటెక్ కంపెనీ ప్రకటించిది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను వాషింగ్టన్ యూనివర్శిటీ సెయింటూ లూయిస్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది.

Tags:    

Similar News