Chandrayan-3: చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం సక్సెస్..విడిపోయిన ల్యాండర్..!
Chandrayan-3: ఈనెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై దిగనున్న చంద్రయాన్-3
Chandrayan-3: చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం సక్సెస్..విడిపోయిన ల్యాండర్..!
Chandrayan-3: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం పూర్తైంది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. దీంతో చంద్రయాన్ 3 చంద్రుడికి మరింత చేరువైంది. ఈనెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై దిగనుంది చంద్రయాన్-3. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ ఇకపై సొంతంగా చంద్రుడి చుట్టూ తిరగనుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన అనంతరం ల్యాండ్ మాడ్యూల్.. థ్యాంక్యూ ఫర్ ది రైడ్ అంటూ సందేశాన్ని పంపినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. ఇక శుక్రవారం సాయంత్రం డీ ఆర్బిట్ ప్రక్రియను చేపట్టనున్న ఇస్రో.. ఆగస్టు 20న రెండో దశ డీ ఆర్బిట్ ప్రక్రియ చేపట్టనుంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగనుంది.