YES బ్యాంక్ సంక్షోభంలో మరొక కీలక పరిణామం

YES బ్యాంక్ సంక్షోభంలో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.

Update: 2020-03-16 16:09 GMT
YES Bank (File photo)

YES బ్యాంక్ సంక్షోభంలో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ను అధికారులు ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. అనిల్ అంబానీకి చెందిన ఆస్తులు ఎస్ బ్యాంకు నుంచి పొందిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారినట్లు ఈడీ పేర్కొంది.

YES బ్యాంక్‌ నుంచి రిలయన్స్‌ గ్రూప్‌ 12,800 కోట్లు రుణాలు తీసుకోవడం, అవి నిరర్థక ఆస్తులుగా మారడంతో ఆయనపై ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. నోటీసులపై అనిల్ అంబానీ స్పందించారు.. ఈడీ ఎదుట హాజరయ్యేందుకు సమయం కావాలని, ఆరోగ్యం బాగోలేని చలెప్పారు. అనిల్‌తో పాటు ఎస్ బ్యాంక్ నుంచి రుణాలు పొందిన ప్రధాన కంపెనీల ప్రమోటర్లందరికీ సమన్లు జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. రాణాకపూర్‌ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించారు.

Tags:    

Similar News