నేను ఆరోగ్యంగానే ఉన్నాను : అమిత్‌ షా

Update: 2020-05-09 11:55 GMT

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్య విషయంపై గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, తాను ఎలాంటి జబ్బుతో బాధపడడంలేదని స్పష్టం చేశారు. ఆయన అనారోగ్యంతో ఉన్నారని.. అందుకే బయటకు రావడం లేదని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారంటూ అనేక రకాల వదంతులు ట్రోల్ అవుతున్నాయి.

కేంద్ర మంత్రిగా తన విధులను సంపూర్ణ అంకితభావంతో నిర్వర్తిస్తున్నానని తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న వారి కోసం ఆయన లేఖను విడుదల చేశారు. అందులో తాను ఎలాంటి అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. 'కొన్ని సోషల్ మీడియాల్లో నా ఆరోగ్యం గురించి వార్తలు రాశారు. కొందరైతే ఏకంగా నేను చనిపోయినట్టు సంతాపాలు కూడా ప్రకటించారు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా. ఎలాంటి అనారోగ్య సమస్య లేదు.' అని అమిత్ షా స్పష్టం చేశారు. దేశం క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారితో పోరాడుతోంది. దేశ హోంమంత్రిగా నేను నా ప‌నిలో బిజీగా ఉన్నాను అలాంటి పుకార్ల‌పై దృష్టి పెట్ట‌లేదని ట్విట్‌లో రాశారు. 



 


Tags:    

Similar News