Covid-19: 40 ఏళ్ల క్రితమే కరోనా వైరస్

ప్రపంచాన్ని మొత్తాని వణికిస్తుంది కరోనా వైరస్.. రోజురోజుకీ వేగంగా విస్తరిస్తూ ప్రజలను బయపెడుతుంది. చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతక

Update: 2020-02-18 02:12 GMT

ప్రపంచాన్ని మొత్తాని వణికిస్తుంది కరోనా వైరస్.. రోజురోజుకీ వేగంగా విస్తరిస్తూ ప్రజలను బయపెడుతుంది. చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతక వైరస్ ఇప్పుడు 25 దేశాలకు విస్తరించింది. ఫలితంగా చాలా మంది చనిపోతున్నారు. అయితే ఈ వైరస్ పై ఓ ఆసక్తికరమైన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డీన్ కూన్జ్ అనే రచయిత 1981లో 'ద ఐస్ ఆఫ్ డార్క్‌నెస్' అనే నవలను రచించాడు. అందులో 40 ఏళ్ల క్రితమే కరోనా వైరస్ గురించి ప్రస్తావన ఉంది. ఆ వైరస్ పేరును వుహాన్-400గా నామకరణం చేశాడు.

ఆ నవలలో వుహాన్ 400 అనే వైరస్ పుడుతుందని, దాన్ని ల్యాబ్‌లోనే జీవాయుధంగా తయారు చేస్తారని ఆయన అందులో పేర్కొన్నాడు. కరోనా పుట్టిన వుహాన్ నగరం పేరునే వైరస్‌కు పెట్టడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఇక భారత్ లో కేరళ రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. కేరళకు చెందిన ఓ విద్యార్థి చైనాలోని వూహాన్ యూనివర్శిటీలో విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటీవల భారత్‌కు వచ్చిన అతనికి కరోనా వైరస్ సోకినట్టు భారత కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు ఈ సంఖ్య ఆరుకి చేరింది. 



Tags:    

Similar News