Amarnath Yatra 2023: అమర్ నాథ్ యాత్రకు భద్రత కట్టుదిట్టం
Amarnath Yatra 2023: జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు కొనసాగునున్న యాత్ర
Amarnath Yatra 2023: అమర్ నాథ్ యాత్రకు భద్రత కట్టుదిట్టం
Amarnath Yatra 2023: అమర్‌నాథ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు కొనసాగునున్న సుప్రసిద్ధ అమర్ నాథ్ యాత్ర కు జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. యాత్ర ప్రారంభానికి సమయం దగ్గరపడటంతో భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఉగ్రదాడులు జరగొచ్చనే నిఘా విభాగం హెచ్చరికలతో ఎక్కడికక్కడ సైనికులను భారీగా మొహరించారు.
చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రతీ ఏడాది జరిగే అమర్నాథ్ యాత్ర శనివారం నుంచి ప్రారంభమై.. ఆగస్టు 31తో ముగుస్తుంది. ఈ తీర్థయాత్ర మొత్తం 62 రోజులపాటు జరుగనుంది. ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.