West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
West Bengal: పోలీస్ వాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ పోలీస్ డ్రైవర్ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు బుర్ద్వాన్‌లో పెట్రోలింగ్ ముగించుకుని తిరిగి పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న పోలీసు వాహనాన్ని ఓ ప్రైవేట్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో పోలీసు వాహనం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసు ఏఎస్‌ఐ, కానిస్టేబుల్, వాలంటీర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మృతుడిని డ్రైవర్ విశ్వనాథ్ ముర్ముగా గాయపడిన ముగ్గురిని కమలేష్ సింగ్, శ్రీకాంత్ సిన్హా, ఆశిష్ ప్రామాణిక్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.