West Bengal: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ప్రమాదంలో ఏడుగురు మృతి

West Bengal: పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Update: 2023-08-27 08:06 GMT

West Bengal: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ప్రమాదంలో ఏడుగురు మృతి

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్‌లలో ఆస్పత్రికి తరలించారు. 24 పరగణాల జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలను చూసి.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. 5 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News