ఢిల్లీలో కొత్తగా 412 కరోనా కేసులు

Update: 2020-05-26 10:25 GMT

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 412 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు 183 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా మరణాలవీ సంభవించలేదని వివరించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,465కి చేరింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల్లో 7233 యాక్టివ్‌గా ఉండగా, 6954 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 288 మంది మరణించారు.

 భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 6,535 కేసులు నమోదు కాగా, 146 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,380కి చేరింది. 

Tags:    

Similar News